అచ్చంపేట : రెండో అంతస్తు నుంచి జారిపడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన అచ్చంపేట పట్టణంలో జరిగింది. అచ్చంపేట పట్టణంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన విద్యార్థిని(17).. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. క్రిస్మస్ సెలవుల కారణంగా ఇంటికి వచ్చిన ఆమె శనివారం రాత్రి రెండో అంతస్తులో అటు ఇటు తిరుగుతూ ప్రమాదవశాత్తు జారి కింద పడింది. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్రంగా గాయపడిన విద్యార్థిని అచ్చంపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచలనతో మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూల్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. విద్యార్థినికి కంటి చూపు సమస్య ఉండటం, రాత్రి కళ్లజోడు పెట్టుకోకపోవడం కారణంగానే ప్రమాదం జరిగిందని సమాచారం.
Tags
Mahabunagar