అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సోమవారం రాత్రి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ ఘర్షణలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థితో పాటు మరికొందరిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారని ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉడుతనూరి లక్ష్మి ఆరోపించింది. జరిగిన సంఘటనపై బాధితురాలు అభ్యర్థి లక్ష్మి ఒక వీడియోను విడుదల చేస్తూ.. సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా నుండి గ్రామంలో ర్యాలీ నిర్వహించామని.. ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు, గుండాలు కొంతమంది నేను రాత్రి ఇంటి వద్ద ఉండగా మా సోదరుడుతో పాటు మరికొంతమంది పై దాడి చేస్తుండగా ఎందుకు కొడుతున్నారని వారిని నివారిస్తూ అడ్డుపడగా నాపై కూడా దాడి చేశారని అభ్యర్థి బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పార్టీనే పోటీ చేయాలా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ఎవరు పోటీ చేయకూడదా భారత రాజ్యాంగం కల్పించిన హక్కును హరించి వేస్తారా అని తాను ఆవేదన వ్యక్తం చేసింది. అధికార పార్టీ నాయకులు గుండాల నుండి నాకు, మా కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులు చట్టం రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. పోటీ అనేది సహజం కానీ ఏకపక్షంగా ఉండాలని కోరుకోవడం ప్రజాస్వామికం కాదని, ప్రజల మన్నలతో ఎవరైనా గెలవచ్చని.. కానీ భౌతిక దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేసి గెలవాలనుకోవడం అవివేకమన్నారు.
Tags
Telangana