భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం



జడ్చర్ల, డిసెంబర్ 12 : మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట డాక్ బంగ్లా సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం గ్రామానికి చెందిన శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు బృందం సభ్యులు అన్న ప్రసాదం అందజేశారు. ముందుగా శుక్రవారం పురస్కరించుకొని శ్రీ బంగారు మైసమ్మ తల్లికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. పారాయణ బృందం సభ్యులు మాట్లాడుతూ హనుమాన్ చాలీసా పారాయణ పఠనంతో హనుమంతుని శక్తి, భక్తి వినయాలని గుర్తు చేస్తుందని, ఆధ్యాత్మిక చింతన, మనశ్శాంతి సానుకూల శక్తిని పెంపొందించుకోవడానికి, రామ భక్తిని పెంపొందిస్తుందన్నారు. కార్యక్రమంలో భక్తులు పోల శ్రీనివాసులు అరుణ దంపతులు, పారాయణ బృందం సభ్యులు సునీత, లావణ్య, దేవాలయ కమిటీ సభ్యులు గోనెల నరేందర్ మహేశ్వరి దంపతులు, గుండు చంద్రశేఖర్, విజయ్ కుమార్, యాదగిరి, పారాయణ బృందం, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow