మంటల్లో కాలిపోయిన ఎస్బిఐ ఎటిఎం
జడ్చర్ల మండలం లోని మండల తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్బిఐ ఎటిఎం లో మంటలు అంటుకున్నాయి.
మంటలను గమనించిన స్థానికులు వెంటనే డయల్ హండ్రెడ్ కు మరియు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మీకాంత్ మరియు వారి టీం సత్వరమే ఎస్బిఐ ఎటిఎం సెంటర్ చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఎస్బిఐ ఏటీఎంలో మంటలు ఎందుకు చెలరేగాయి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదు అంటే ఏసీ యూనిట్లు ఏదైనా లోపమా ఇతరత్రా కారణాలు తెలియాల్సి ఉంది విషయం తెలుసుకున్న జడ్చర్ల సిఐ కమలాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఎస్బిఐ బ్యాంక్ వాళ్ళు ఎవరు ఆ సమయానికి ఏటీఎం దగ్గరికి రాలేదు.
ఎస్బిఐ ఏటీఎంలో ఏమైనా నగదు నిల్వలు ఉన్నాయా వాటికి ఏమైనా మంటలు అంటుకున్నాయా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
