గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని.. 9వ తరగతి విద్యార్థి పై కేసు


 జడ్చర్ల : ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని గర్భవతి కావడంతో ఈ ఘటన జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు చేరింది. జడ్చర్ల మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని, అదే గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న అబ్బాయి పరస్పరం ప్రేమించుకుని సహజీవనం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే యువతి గర్భం దాల్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు జడ్చర్ల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, పోలీసులు ఘటన పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనలో బాధితులు ఇద్దరూ మైనర్లు కావడంతో, ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మైనర్లను జువెనైల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన పై పూర్తి వివరాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow