ఆయన రవాణాశాఖలో డిప్యూటీ కమిషనర్. సీనియారిటీని బట్టి నెలకు అటు ఇటుగా లక్ష రూపాయల జీతం వస్తుంది. అన్ని ఖర్చులు పోగా నెలకు రూ.50 వేలు మిగులుతాయి అని లెక్కలు వేసుకున్నా పదేళ్లు కూడబెట్టినా రూ.60 లక్షలకు మించవు. కానీ ఆయన ప్రస్తుత ఆస్తి చూస్తే కళ్ళు తిరగాల్సిందే. ఏకంగా రూ.200 కోట్ల అక్రమ సంపాదన చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. మంగళవారం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై మహబూబ్‌నగర్ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ బోయిన్‌పల్లి, ఆర్‌ఆర్‌నగర్‌లోని ఆయన ఇంటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో తమిఖిలు చేపట్టిన అధికారులు భారీ స్థాయిలో ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం వీటి మొత్తం విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సోదాల్లో పెట్రోల్ బంక్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, స్థిర, చరాస్తులతో పాటు బ్యాంకు లాకర్లలో కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు కిషన్ నాయక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు.
Tags
Telagana