తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government). సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రిజర్వేషన్ల ఖరారు కోసం పంచాయతీ రాజ్ శాఖ జీవో విడుదల చేసింది. పంచాయతీరాజ్ జీవో ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు జిల్లా కలెక్టర్లు. 50శాతం రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ , ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ప్రభుత్వ జీవోతో బీసీలకు 23శాతం దక్కనున్నాయి సర్పంచ్, వార్డు స్థానాలు.
Tags
Telagana
