Chevella Accident: ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 10 మందికి పైగా మృతి

 

చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో బస్సులోకి టిప్పర్ దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందారు.


చేవెళ్ల, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో బస్సులోకి టిప్పర్ దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందారు. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరగటంతో సీట్లలోనే వీరు ఇరుక్కుపోయారు. టిప్పర్ కింద ఇరుక్కున్న బస్సులో ముందు వరుస ఐదు రోల సీట్లు డ్యామేజ్ అయ్యాయి. ప్రమాదం ధాటికి కంకర రాళ్ళతో బస్సు సగ భాగం నిండిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎంత మంది చనిపోయారనేది తెలియాల్సి ఉంది.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow