గుండుమాల్ : ప్రభుత్వ ఆసుపత్రి, అంగన్ వాడి సెంటర్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ అకస్మిక తనిఖీ చేశారు. దీంతో అప్పటికప్పుడు విషయం తెలుసుకున్న వైద్యాధికారులు పరుగు పరుగున ఆసుపత్రికి రావడం గమనార్హం. ప్రతి నెల ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు చేసుకునేలా గర్భిణీలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం 26 మంది గర్భిణీల నమోదు కు ప్రసవాలకు 22 సిజరిన్ లు కాగా వాటిలో 15 ప్రైవేటులో జరిగాయని, 4 ఆరోగ్య కేంద్రంలో జరిగాయని వైద్య సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలనీ ఆదేశించారు. హెచ్.బి తక్కువ ఉన్న గర్భిణీలకు ఐరన్ మాత్రలు అందించాలన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని, ఆస్పత్రిలో న్యుమోనియా కేసులు ఏమైనా నమోదు అయ్యాయా అని ఆరా తీశారు. అలాగే టీబీ, ముక్త్ అభియాన్ క్యాంపులు నిర్వహిస్తున్నారా ? క్యాంపులో ఎన్ని ఓపీ లు చూస్తారని, క్యాంపులో మొబైల్ ఎక్స్ రే యంత్రం అందుబాటులో ఉంటుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి లో ఏమైనా సమస్య ఉంటే చెప్పాలని అడిగిన కలెక్టర్ కు తాగునీటి సమస్య, ఒక ఇన్వైటర్ కావాలని సిబ్బంది కోరారు.
న్యూట్రిషన్ డే, ఎన్సిడి స్క్రీనింగ్ గురించి వాకబు చేశారు. ట్యాబ్ లో సరైన వివరాలు నమోదు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో బాలబాలికలకు ఐరన్ ఫ్లోరిక్ మాత్రలను ఇవ్వాలనీ గ్రామాల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్ వాడీ కేంద్రంలో 20 మంది పిల్లలకు 14 మంది ఉండటంపై వివరణ కోరారు. అంగన్ వాడీ కేంద్రం అపరిశుభ్రంగా ఉండటం, లైట్లు సరిగ్గా లేకపోవడం గమనించిన కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పది రోజుల్లో తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Tags
mahabubnagar