గంగాధరిపల్లిలో కుక్కల దాడి: 15 గొర్రె పిల్లల మృతి


# కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రెలు

# బాధిత రైతులకు రూ.20,000 ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

 బాలనగర్:  గంగాధరిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 3:40 గంటలకు జరిగిన దుర్ఘటనలో మొత్తం 15 గొర్రె పిల్లలు కుక్కల దాడికి గురై మరణించిన విషయం బాధాకరం. ఈ ఘటనలో రైతులు రాములు (5), చెనయ్య (3), నరేష్ (2), మలయ్య (2), జంగయ్య (2), నర్సిమా (1)  కుటుంబాలు నష్టాన్ని ఎదుర్కొన్నారు.

ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి  వెంటనే స్పందించి, బాధిత కుటుంబాలకు స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా తక్షణ ఆర్థిక సాయంగా మొత్తం రూ.20,000 అందజేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow