పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మద్దూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్


 మద్దూరు: మద్దూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మార్నింగ్ వాక్‌లో భాగంగా శుక్రవారం మున్సిపల్ పరిధిలోని ఎర్రగుంట తండాలో పర్యటించి సైడ్ డ్రైన్‌లను, సిసి రోడ్లను, వీధి దీపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటితోపాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మురుగునీరు సాఫీగా పోయేందుకు కాలువలలో చెత్త వేయకుండా చూసుకోవాలన్నారు. ప్రజలు కూడా బాధ్యతగా చెత్తను రోడ్లపై, కాలువలో వేయకుండా మున్సిపల్‌ కార్మికులకు అందించాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, సిబ్బంది ఆంజనేయులు, కేశవులు జవాన్‌లు తండా నాయకులు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow