కార్యదర్శి తప్పిదంతో తారుమారైన రిజర్వేషన్.. గ్రామంలో కలకలం


 మానవపాడు : మానవపాడు మండలం చెన్నిపాడు సర్పంచ్ రిజర్వేషన్ ప్రకటనలో గందరగోళం ఏర్పడింది. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ జారీచేసిన ప్రకటనలో చెన్నిపాడు సర్పంచ్ స్థానం జనరల్ అని ప్రకటించారు. కానీ స్థానిక పంచాయతీ కార్యదర్శి మాత్రం నోటీస్ బోర్డులో బీసీ జనరల్ ప్రకటించడంతో రిజర్వేషన్ తారుమారు అయిందని.. ఎన్నికల అధికారి ఇచ్చిన నోటిఫికేషన్లు జనరల్ రావడం.. పంచాయతీ కార్యదర్శి బీసీ జనరల్ అని ప్రకటించడంతో ప్రజలంతా అవాక్కయ్యారు. వేరువేరుగా ప్రకటించిన రిజర్వేషన్లు ఏది కరెక్ట్ అని సందిగ్ధంలో చెన్నిపాడు గ్రామస్తులు పడిపోయారు. అంతేకాక గ్రామపంచాయతీ నోటీసుల పై కూడా రిజర్వేషన్ ప్రక్రియ చెన్నిపాడు సర్పంచ్ స్థానం బీసీ జనరల్ అతికించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పై ఎంపీడీవో రాఘవను వివరణ కోరగా... స్థానిక సర్పంచ్ నామినేషన్ల పర్వం ప్రారంభం అయిందని, మానవపాడు మండలం మూడో విడుతలో ఉందన్నారు. చెన్నిపాడు జనరల్ స్థానం రిజర్వేషన్ అయిందని, పంచాయతీ కార్యదర్శి చూసుకోకుండా నోటీసు బోర్డులో వేయడం తప్పు అన్నారు. ప్రింటింగ్ తీసే క్రమంలో బీసీ జనరల్ అని పడిన విషయం వాస్తవమేనని, అది గమనించకుండా పంచాయతీ కార్యదర్శి నోటీసు బోర్డు పై వేసింది అన్నారు. స్థానిక సర్పంచ్ స్థానం జనరల్ రిజర్వేషన్ అయిందని చెన్నిపాడు గ్రామస్తులు గమనించాలని తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow