💥 *ఫలించిన.... నేనుసైతం పోరాటం*
💥 *కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని....కమిషనర్ ఆదేశం*
💥 *ఆరు నెలల పోరాట.... ఫలితం*
💥 *న్యాయం గెలిచిందన్న... నేనుసైతం*
💥 *సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్*
. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా మహబూబ్ నగర్ పట్టణం డిఈవో ఆఫీస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ టీ. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గత ఆరు నెలలుగా *సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్* చేసిన న్యాయపోరాటం ఫలించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో విచారణ చేపట్టిన మున్సిపల్ కమిషనర్ అనుమతులు లేని కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కమిషనర్ ఆదేశాలపై సామాజిక కార్యకర్త ప్రవీణ్ హర్షం వ్యక్తం చేస్తూ, న్యాయం గెలిచిందని ఆయన తెలిపారు. నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒక సామాజిక కార్యకర్తగా తన పోరాటాన్ని గత ఆరు నెలలుగా కొనసాగించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ తో పాటు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ లకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని ఆయన తెలిపారు.
*హైకోర్టు జోక్యంతోనే....*
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలోనే కృష్ణ విగ్రహంపై కమిషనర్ విచారణ జరిపి తొలగించేలా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని సామాజిక కార్యకర్త ప్రవీణ్ తెలిపారు. కృష్ణ విగ్రహానికి అనుమతులు లేనివి, తొలగించాలని తేదీ 29-05-2025 నుండి పోరాటం కొనసాగిస్తున్నమని ప్రవీణ్ పేర్కొన్నారు. ఈ విషయమై పలుమార్లు కలెక్టర్, కమిషనర్లకు ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. చేసేదేమీ లేక హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, హైకోర్టులో పెనుబల్లి రమేష్ బాబు, దేవర సంహిత వాదనలు వినిపించరని ఆయన తెలిపారు. హైకోర్టు జోక్యంతో మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో 100 రోజుల అనంతరం విచారణ చేపట్టిన కమిషనర్ ఎట్టకేలకు విగ్రహాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం హర్షించదగ్గ పరిణామం అని ప్రవీణ్ తెలిపారు.
*న్యాయం గెలిచింది....*
నిబంధనల విరుద్ధంగా ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని గత ఆరు నెలలుగా తాను చేస్తున్న పోరాటంలో న్యాయం గెలిచిందని సామాజిక కార్యకర్త ప్రవీణ్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని కమిషనర్ ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఇకనైనా మున్సిపల్ కమిషనర్ తో పాటు కలెక్టర్ ఇతర అధికారులు ప్రధాన కూడళ్ళు, ఫుట్పాత్లపై, రహదారుల వెంబడి విగ్రహాలను ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ప్రవీణ్ కోరారు.
