వివాహిత అదృశ్యం.. అంత‌లోనే బిగ్ ట్విస్ట్..!


 నవాబుపేట : వివాహిత అదృశ్య‌మైన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని కాక‌ర్ల‌ప‌హాడ్ గ్రామ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. న‌వాబుపేట మండ‌ల ప‌రిధిలోని కాక‌ర్ల ప‌హాడ్ కి చెందిన తోట కృష్ణ‌వేణి(23) ఈనెల 3న అదృశ్య‌మైంద‌ని దేవ‌ర‌క‌ద్ర ప‌రిధిలోని మూసాపేట మండ‌లం వేముల గ్రామానికి చెందిన ఆమె భ‌ర్త తోట యాద‌య్య గురువారం న‌వాబుపేట పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రెండు నెల‌ల కింద‌ట త‌నతో గొడ‌వ‌ప‌డి త‌న భార్య కృష్ణ‌వేణి త‌ల్లిగారి గ్రామం కాక‌ర్ల ప‌హాడ్ కి వెళ్లింద‌ని.. అలా వెళ్లిన భార్య రెండు నెల‌లు గ‌డిచినా త‌న‌తో కాపురం చేయ‌డానికి తిరిగి రాలేదని తెలిపారు. ఆమె రాక‌పోవ‌డంతో పెద్ద‌ల‌తో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుందామ‌ని బావ‌మ‌రిది మ‌ల్లేష్ కి ఫోన్ ద్వారా స‌మాచారం ఇచ్చాడు. అయితే ఈనెల 05న ఆమెతో మాట్లాడి కాపురానికి పంపిస్తాన‌ని త‌న బావ‌మ‌రిది మ‌ల్లేష్ చెప్పాడు. ఈనెల 05న కాక‌ర్ల‌ప‌హాడ్ కి వ‌స్తున్నామ‌ని యాద‌య్య అన్న వెంక‌టేష్ బావ‌మ‌రిది మ‌ల్లేష్ కి చెప్ప‌గా.. ఈనెల 03న త‌న చెల్లి గుర్తు తెలియ‌ని వ్య‌క్తితో వెళ్లింద‌ని ట్విస్ట్ ఇచ్చాడు. త‌న చెల్లెలుతో పాటు వెళ్లిన వ్య‌క్తి ఫోన్ నెంబ‌ర్ 784225571 అని తెలిపార‌ని త‌న ఫిర్యాదులో యాద‌య్య పేర్కొన్నాడు. భార్య ఆచూకి తెలుసుకొని త‌న‌కు అప్ప‌గించాల‌ని పోలీసుల‌ను కోరారు. యాద‌య్య ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్టు ఎస్సై విక్ర‌మ్ తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow