ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల నిర్వహనకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 889 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మే 13 నుంచి 21 వరకు జరిగే ఈ పరీక్షలు..
హైదరాబాద్, మే 12: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల నిర్వహనకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 889 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మే 13 నుంచి 21 వరకు జరిగే ఈ పరీక్షలు ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయత్రం 5.30 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులకు ఈ పరీక్షలు జరగనున్నాయి. రెండు సెషన్స్‌లో పరీక్షలు జరుగుతాయని, ప్రశ్న, జవాబు పత్రాలు పోలీస్ ఎస్కార్ట్ ద్వారా రవాణా చేయాలని విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. హాల్ టికెట్లలో తప్పులు దొర్లితే సంబంధిత కళాశాలల ద్వారా డీఐఈవో ఆఫీస్‌లో సంప్రదించాలని సూచించింది.
కాగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,98,358 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. దీంట్లో జనరల్ విభాగంలో మొత్తం 3,69,294 మంది విద్యార్ధులు, ఒకేషనల్ విభాగంలో 28,703 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 2,67,141 మంది ఉండగా.. సెకండియర్ నుంచి 1,30,856 మంది విద్యార్థులు ఉన్నారు. అటు ఏపీలో మే 21వ తేది నుంచి జూన్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.