116 గ్రాముల గంజాయి పట్టివేత.. వ్య‌క్తి అరెస్ట్


  జడ్చర్ల : జార్ఖండ్ రాష్ట్రం నుంచి గంజాయి తీసుకొచ్చి జడ్చర్ల పరిసరాల్లో విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి 116 గ్రాముల గంజాయిని సీజ్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ మహబూబ్ న‌గ‌ర్ డీటీఎఫ్ సుధాకర్ గౌడ్ తెలిపారు. గురువారం జడ్చర్ల మున్సిపాలిటీ శివారులోని శంకరయపల్లి తండా స్టేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమాన‌స్ప‌దంగా తిరుగుతున్నాడు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పింటూసా ని అదుపులోకి తీసుకొని అతన్ని త‌నిఖీ చేయగా.. 116 గ్రాముల గంజాయిని లభ్యమైందని ఒకడిని అరెస్టు చేసి విచారణ చేప‌ట్టారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పింటుస ఉదండాపూర్ ప్రాజెక్టులో పని చేస్తూ ఉంటాడని.. ఝార్ఖండ్ రాష్ట్రం నుండి గంజాయి తీసుకొచ్చి ప్రాజెక్టులో పని చేసే వారితో పాటు పోలేపల్లి సెజ్ లో పని చేసే వ్యక్తులకు, జడ్చర్ల పట్టణంలోని పలువురు యువకులకు గ్రామూల చొప్పున గంజాయిని విక్రయిస్తుంటాడని వారు గుర్తించారు. నిందితుడి వద్ద లభించిన గంజాయిని సీజ్ చేసి నిందితుడినీ రిమాండ్ కు తరలించినట్లు డీటీఎఫ్ సుధాకర్ గౌడ్ తెలిపారు. గంజాయి విక్రయించిన, వాడినా చట్టపరంగా కఠినంగా చ‌ర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రించారు. గంజాయి విక్రయించే వారి సమాచారం ఎవరైనా అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ సీఐ కవిత, ఎస్సై రాజేందర్ సిబ్బంది ఉన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow