అయ్యప్ప నడిచిన మార్గం..ఎరుమెలి టూ శబరిమల కీంకారణ్యంలో.. రాళ్లు రప్పల్లో


 

ఎరుమెలి నుండి శబరిమల వరకు సాగే పెద్ద పాదం వనయాత్ర అయ్యప్ప దీక్షలోని అత్యంత కఠినమైన ఘట్టం. కొండలు, రాళ్లు, కీంకారణ్యంలో నడుస్తూ, భక్తులు భక్తితో ఈ మార్గాన్ని పూర్తి చేస్తారు. మహిషి వధించిన అళుదానది, కరిమల కొండ వంటి కీలక స్థలాలను దాటి, పంబా నది స్నానంతో ఈ పుణ్య యాత్ర ముగుస్తుంది. ఇది అయ్యప్ప స్వామి స్వయంగా నడిచిన దారి, భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది.

స్వామియే శరణం అయ్యప్ప..ఆ హరిహర పుత్రుని దీక్ష అత్యంత కఠి‌నం. ఆ పద్దెనిమిది మెట్ల సోపానాదిపతిని చేరడం కూడా అత్యంత కఠినం. కొండలు దాటి కోనలు దాటి, రాళ్లు రప్పల దారులు దాటి కీంకారణ్యంలో అతి కష్టంగా సాగితే తప్ప అయ్యప్ప ను చేరడం సాధ్యం కాదు. మండలం కాలం దీక్ష చేసిన ప్రతి ఒక్క స్వామి వనయాత్ర చేస్తే ఆ శబరిగిరీశుని దర్శన భాగ్యం దక్కుతుందంటారు. ఆయన యాత్ర లో పెట్టే కాల పరీక్ష అత్యంత కఠినం.. ఎరుమెలి నుండి శబరి పీఠం వరకు సాగే పాదయాత్ర మరింత కఠినం. మారుతున్న కాలానికి తగ్గట్టు సదుపాయాలు మెరుగు పడుతున్నా.. ఆ ఒక్క పెద్దపాదంలో మాత్రం ఇంకా ఆనాటి ప్రయాణమే. సాక్ష్యాత్తు అయ్యప్ప నడయాడిన మార్గమే పెద్దపాదం. మరీ ఆ పెద్ద పాదం యాత్ర ఎలా ఉంటుంది.. ఎన్ని‌పరీక్షలు పెడుతుంది.. అడుగడుగున కాలం పెట్టే పరీక్షలకు ప్రకృతి ఎలా సహాకారం అందిస్తుంది.. ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం
మండల కాలం అయ్యప్ప దీక్ష పూర్తి చేసి ఆ ఆనంద రూపాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. అయ్యప్ప ను చేరుకునేందుకు రెండు నడక మార్గాలు ఉండగా.. అందులో అత్యంత కీలక ఘట్టం పెద్ద పాదం నడకయాత్ర. మాల వేసిన స్వామి ఒక్కసారైనా నడిచి తీరాల్సిన దారి పెద్దపాదం. ఈ మార్గంలో నడక ఆశమాసి కాదు. అడుగడుగునా ప్రకృతి పరీక్షిస్తూనే ఉంటుంది కాలం ఓ కంటకనిపెడుతూనే ఉంటుంది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆ హరిహరసుతుని సన్నిధానానికి చేరుకోగలిగే మార్గాల్లో ఇదే ప్రధానమైనది.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow