పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం..రాజాపూర్ ఎస్ఐ శివానంద్ గౌడ్


వారి ఆత్మకు శాంతి చేకూర్చుదాం..

రాజాపూర్ ఎస్ఐ శివానంద్ గౌడ్ 

రాజాపూర్ అక్టోబర్ 27 

సమాజ హితం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు మహావీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని రాజాపూర్ సబ్ ఇన్ స్పెక్టర్ శివానంద్ గౌడ్ అన్నారు. సోమవారం రాజపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు, దేశంలో పోలీసులు నిత్యం పహారా కాస్తూ ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షిస్తున్నారని ఎస్ఐ శివానంద్ గౌడ్ పేర్కొన్నారు. 



చట్టం అందరికీ సమానమేనని, ఎవరు కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఐ శివానంద గౌడ్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఎస్ఐ శివానందగౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.





Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow