*1,71,21,636 నిధుల రికవరీకి ఆదేశం*
*పోలేపల్లి సర్పంచ్ కు జిల్లా కలెక్టర్ నోటీసులు*
*'దిశ' వార్తా కథనం ఆధారంగా విచారణ జరిపి నిగ్గు తేల్చిన అధికారులు.
విచారణలో మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ నిధుల వినియోగం చేసింది వాస్తవమేనని కమిటీ నివేదికలో తెలపడంతో టిఎస్పిఆర్ చట్టం 2018 సెక్షన్ 283 (2) ప్రకారం పోలేపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మాజీ, ఉప సర్పంచ్ నుంచి దుర్వినియోగం చేయబడిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు కమిషనర్ పిఆర్ ఆర్ ఇ ఈ హైదరాబాద్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు.
దీంతో జిల్లా కలెక్టర్ పోలేపల్లి మాజీ సర్పంచ్ చేతన రెడ్డి మాజీ ఉప సర్పంచ్ లావణ్య కు నోటీసులు జారీ చేశారు.
సంవత్సర కాలంగా తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలు పకడ్బందీగా లభ్యం కావడం తో దుర్వినియోగం చేసిన ₹1,71,21,636 డబ్బు తిరిగి చెల్లించడం తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్వినియోగానికి పాల్పడిన మొత్తం డబ్బులు రికవరీ చేయాల్సిందిగా ఆర్డర్ కాపీలను జడ్చర్ల తహసీల్దార్ ఎంపీడీవోకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డివిజన్ మహబూబ్నగర్ అధికారులకు ఉత్తర్వు కాపీలను అందజేశారు.
