మిడ్జిల్ : బైకు కు వెళ్తున్న వారికి వీధి కుక్కలు అడ్డుగా వచ్చి తగలడంతో మహిళా తీవ్రంగా గాయపడిన సంఘటన మండల కేంద్రంలోని వాడ్యాల గేటు సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండలం తమ్మడ కుంట తండా కు చెందిన లక్ష్మి (55) గురువారం సాయంత్రం మిడ్జిల్ సంతలో కూరగాయలు తీసుకొని వెళ్తుండగా అదే తాండాకు చెందిన రమేష్ అనే యువకుడు బైకు పై లిఫ్ట్ అడిగి వెళ్లాడు. అయితే వాడ్యాల గేటు సమీపంలో 167 హైవే పై కల్వకుర్తి- జడ్చర్ల ప్రధాన రహదారి పై కుక్కలు అకస్మాత్తుగా రోడ్డు పైకి వచ్చి బైకు కు తగిలాయి. దీంతో బైకు అదుపుతప్పి కింద పడడం తో లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. రమేష్ స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ లక్ష్మిని మెరుగైన చికిత్స కోసం 108లో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Tags
Jadcherla