మ‌క్త‌ల్ : గూడ్స్ కింద న‌లిగి 18 గొర్రెలు మృతి


 మ‌క్త‌ల్ : గూడ్స్ బండి చ‌క్రాల కింద న‌లిగి 18 గొర్రెలు మృతి చెందిన సంఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్లపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. మక్తల్ మండల పరిధిలోని గుర్లపల్లి గ్రామానికి చెందిన గొర్ల కాపరి యజమాని కుర్వ వెంకటప్ప చెప్పిన వివరాల ప్రకారం.. రైలు పట్టాల పక్క ఉన్న పొలంలో గొర్రెలు మేపుతుండగా గూడ్స్ బండి వస్తున్నది గమనించి ముందు ఉన్న గొర్రెల మందును పక్కకు తప్పిదామని ప్రయత్నిస్తుండగా.. తన వెంబడి ఉన్న గొర్రెలు హఠాత్తుగా రైలు పట్టాల పైకి వెళ్లాయి. అప్పుడే రాయచూర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న గూడ్స్ బండి చక్రాల కింద పడి నలిగి మృతి చెందాయి. ఒక్కొక్క గొర్రె పదివేల వరకు ధర ఉంటుందని బోరున విలపిస్తూ యజమాని వెంక‌ట‌ప్ప‌ చెప్పాడు. పేద గొర్రె కాపరులైన తను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఈ విషయాన్ని మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్తానని వెంకటప్ప తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow