వైద్య విద్యార్థి ఆకాంక్షకు చేయూత ...

 


*అదనపు కలెక్టర్ చేతుల మీదుగా చెక్కు అందజేత*

రెడ్ క్రాస్ విద్యా నిధి నుంచి వైద్య విద్యార్థిని ఆకాంక్షకు రూ 85 వేల రూపాయల చెక్కును అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అందజేశారు. మహబూబ్ నగర్ లోని శివ శక్తి నగర్ కు చెందిన ఆకాంక్ష నల్లగొండలోని మెడికల్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతుంది. ఆకాంక్ష వైద్య విద్యను కొనసాగించేందుకు గత మూడేళ్లుగా రెడ్ క్రాస్ విద్యా నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. ప్రతిభ కలిగి పేదరికం ఉన్న విద్యార్థులకు 2021 నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చైర్మన్ నటరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డాక్టర్ శ్యామల్, రాష్ట్ర యం సి మెంబర్ రమణయ్య, జిల్లా సభ్యులు తిరుపతి రెడ్డి, బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow