జడ్చర్ల : గుట్టు చప్పుడు కాకుండా కిరాణా షాపులో
*కిరాణా షాపుల్లో గంజాయి విక్రయం*గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి లక్ష రూపాయల విలువగల 1.2 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ద్విచక్ర వాహనం, మూడు ఫోన్లు సీజ్ చేసినట్లు జడ్చర్ల ఎక్సెజ్ సీఐ విప్లవ రెడ్డి తెలిపారు. ఈ మేరకు విప్లవ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. బాలానగర్ మండల పరిధిలోని గుండేడి నుంచి ఉడిత్యాల వెళ్లే దారిలో ఉన్న కిరాణం షాపులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం మేరకు జడ్చర్ల ఎక్సెజ్ ఎస్సె జె. నాగరాజు తన సిబ్బందితో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. కిషన్, నేనావాత్ కృష్ణ, అతడి భార్య లాలి గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించామని వారి వద్ద నుండి 1.2 కేజీల గంజాయిని స్వాధీనపరచుకొని వారిని అరెస్ట్ చేసి విచారించగా హైదరాబాద్ నుండి గంజాయి తీసుకువచ్చి ఆరు గ్రాముల చొప్పున ప్యాకెట్ తయారు చేసి పరిసర పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు 400 ఒక ప్యాకెట్ చొప్పున విక్రయిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు ముగ్గురి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామని జడ్చర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి విక్రయాలు జరిపినట్లైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇలా విక్రయాలు జరుపుకున్నట్లు ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే ఎక్సెజ్ పోలీసులకు సమాచారం అందించాలని సిఐ విప్లవ రెడ్డి సూచించారు. గంజాయి పట్టుకున్న వారిలో ఎస్సై జె నాగరాజు సిబ్బంది సిద్ధార్థ, స్నేహలత, సునీత ఉన్నారు.
