School Holiday: నేడు తెలంగాణలోని ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు.. కలెక్టర్ ఉత్తర్వులు!
School Holiday: తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుపాను ప్రభావం పడిపనట్లు తెలిపింది. నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురుగాలులు, భారీవర్షాలతో మొంథా ముంచేసింది
School Holiday: మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్ష బీభత్సం ఉండగా, ఏపీ రాష్ట్ర మాత్రం వర్షాలతో ముంచెత్తుతోంది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మొంథా తుఫాను కారణంగా ఏపీలో చాలా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ఇప్పుడు తెలంగాణలో ఓ జిల్లాలో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మొoథా తూఫాను దృష్ట్యా బుధవారం ఖమ్మం జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా బుధవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు.
