ఏసీబీకి చిక్కిన విద్యుత్తు శాఖ లైన్ మెన్



  ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు విద్యుత్తు శాఖ లైన్ మెన్ నాగేందర్ పట్టుబడిన సంఘటన మంగళవారం నా గర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం మాచి నోని పల్లి గ్రామంలో జరిగింది. వివరాలలోకి వెళితే మాచి నోనిపల్లి గ్రామానికి చెందిన రైతు తన పొలములో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. కానీ లైన్ మెన్ పనులు జరగాలి అంటే 20వేల రూపాయలు లంచం ఇవ్వాలి అని డిమాండు చేశాడు. అంతా ఇచ్చుకోలేను తగ్గించండి సార్ అని రైతు విజ్ఞప్తి చేయగా 15000 ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మహబూబ్ నగర్ అవినీతి నిరోధక శాఖ డి.ఎస్.పి బాలకృష్ణ సారధ్యంలో సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించి డబ్బులు ఇవ్వగానే లైన్ మెన్ ను అదుపులోకి తీసుకున్నారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లైన్ మెన్ పై కేసు నమోదు చేసాము. బుధవారము కోర్టులో ప్రవేశపెడతాము అని డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow