TGPSC On Group-1: గ్రూప్‌-1పై అప్పీల్‌కు వెళ్లేందుకు TGPSC నిర్ణయం.

 

హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్‎కు వెళ్లేందుకు TGPSC నిర్ణయం తీసుకుంది.

మేరకు సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో TGPSC పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రీవాల్యుయేషన్‌ చేస్తే టెక్నికల్‌ సమస్యలు వస్తాయని TGPSC అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సింగల్ బెంచ్ తీర్పు కాపీపై లీగల్ టీమ్ గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తోంది. గ్రూప్‌-1 నియామకాల్లో లోపాలు లేవని TGPSC వాదించడానికి సిద్ధం అయ్యింది

.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow