*ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద పరిస్థితులపై జిల్లా ఎస్పీ డి.జానకి, సమీక్ష*
నిన్న అర్ధరాత్రి నుండి నిరంతర వర్షాలు కురుస్తుండటంతో మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ స్వయంగా పరిస్థితులను పరిశీలించారు.
మహబూబ్‌నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త చెరువు పరివాహక ప్రాంతాలను సందర్శించి, నీటి వృద్ధిని సమీక్షించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచనలు జారీ చేశారు. ఈ రాత్రి కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.
తదనంతరం జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ , రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ స్పందనతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా, రెస్క్యూ, రీలీఫ్ చర్యల్లో పోలీస్ అధికారులు, మున్సిపల్, రెవెన్యూ మరియు ఇతర శాఖల సమన్వయం అత్యంత కీలకమని గుర్తుచేశారు.
ఈ సందర్శనలో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డిఎస్పి వెంకటేశ్వర్లు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్యతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం తప్ప బయటకు వెళ్లవద్దని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేస్తున్నా
రు.
