హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల జీఓ (BC Reservations GO)ను తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఇవాళ (శుక్రవారం) విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ- 09 విడుదల చేసింది రేవంత్‌రెడ్డి సర్కార్. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్!
బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
జీవో విడుదల కావడంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం కానున్నట్లు తెలుస్తుంది.
బీసీల రిజర్వేషన్ పై గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీలింగ్ను ఎత్తేసి, అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
.
కానీ బిల్లు చట్టరూపం దాల్చడానికి రాష్ట్రపతి పార్లమెంటు ఆమోదరం లేకపోవడంతో జీవో విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఇంతకు ముందుగానే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆర్డర్ వేసిన సంగతి అందరికీ తెలిసింది.

Tags
Telangana

