తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియమించింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు శివధర్ రెడ్డి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
హైదరాబాద్, సెప్టెంబరు 26 ): తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి (New DGP Shivdhar Reddy)ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) నియమించింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు శివధర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. శివధర్ రెడ్డిని నియమిస్తూ ఈ మేరకు కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు శివధర్ రెడ్డి.
Tags
Telangana
