ప్రమాదకర స్థాయిలో మూసీ ఉధృతి..



 హైదరాబాద్, సెప్టెంబర్ 26: మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. భారీ వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో 17 గేట్లు ఎత్తారు అధికారులు. ఈ సీజన్‌లో తొలిసారిగా 17 గేట్లను ఎత్తారు జలమండలి అధికారులు. ఫలితంగా నగరంలో మూసీ ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల నుంచి 13 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. హిమాయత్ సాగర్‌ 6 గేట్లు ఎత్తి.. 6వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. అదే సమయంలో ఉస్మాన్ సాగర్ 11 గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. మూసీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలాఉంటే.. మూసారంబాగ్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉంది. బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జిప్‌పై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. మూసీ వరద ఉధృతి అంతకంతకూ పెరిగిపోతుండటంతో.. ముసారాంబాగ్ పరిసర ప్రాంత ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు ఓల్డ్ సిటీలోని మూసీ పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ, పురానాపూల్, గోల్కా, ముసారాంబాగ్ ప్రాంతాలు నీట మునిగాయి. జియాగూడ 100 ఫిట్ రోడ్, పురాణ ఫుల్, హైకోర్టు మార్గంలో రోడ్డుపైకి వరద వచ్చింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow