జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం సిగ్నల్గడ్డపై 167వ నెంబరు జాతీయరహదారి విస్తరణ పనుల్లో భాగంగా బుధవారం ఎట్టకేలకు మహానీయుల విగ్రహాలు తొలగింపు ప్రక్రియ పూర్తిచేశారు. మొదట నెహ్రు, ఇందిరాగాంధీ విగ్రహాలను కమీషసర్ లక్ష్మారెడ్డి, చైర్పర్సన్ కోనేటి పుష్పలతతో పాటు వార్డు కౌన్సిలర్లు దగ్గరుండి తొలగింపజేశారు. అంబేద్కర్ విగ్రహం, పూలే విగ్రహం తొలగింపు మాత్రం ఉద్రిక్తతల మద్య జరిపించారు. రోడ్డు పనులు పూర్తయ్యాక విగ్రహాల ప్రతిష్టకు హమి ఇవ్వటంతో ఆందోళనలు విరమించారు. ఇదే క్రమంలో మాజి మంత్రి లక్ష్మారెడ్డి సైతం అక్కడికి చేరుకుని సంఘాలతో మాట్లాడారు. | I
Tags
Jadcherla