JADCHERLA :-దారి దోపిడీకి పాల్పడిన దొంగలను పట్టుకున్న జడ్చర్ల పోలీసులు


సినీఫక్కీలో దారి దోపిడీకి పాల్పడిన దొంగలను పట్టుకున్న జడ్చర్ల పోలీసులు. డెబ్బయి రెండు వేల రూపాయలను రికవరీ చేసి దుండగులను రిమాండ్ తరలించా మన్న మహబూబ్ నగర్ డిస్పీ వెంకటేశ్వర్లు.


వాయిస్ ఓవర్ : ఈ నెల 7వ తేదీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మద్యం దుకాణం లో మేనేజర్ గా పనిచేస్తున్న రోహిత్ రెడ్డి అనే వ్యక్తి దుకాణం మూసేసిన తర్వాత ఏనుగొండ వెళ్లేందుకు వెళ్తుండగా అప్పటికే ఆయన పై నిఘా వేసిన మహబూబ్ నగర్ పట్టణం వీరన్న పేటకు చెందిన మూలింటి బాలాజీ, మూలింటి రవితేజ లు నక్కల బండ తండా సమీపంలో కళ్లలో కారం పొడి చల్లి దాదాపు లక్ష యాభై వేల రూపాయలు ఎత్తు కెళ్ళినట్లు తెలిపారు. పిర్యాదు అందుకున్న జడ్చర్ల సి ఐ కమలాకర్ వాహనాల తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా కనిపించని వారిని విచారించగా చోరీ వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. నిందితుల దగ్గర డెబ్బయి రెండు వేల రూపాయలు ఒక సెల్ ఫోన్ రికవరీ చేసినట్లు తెలిపారు. దారి దోపిడీకిజరిగిన నాలుగు రోజుల్లో నిందితులను పట్టుకున్న పోలీసులను అభినందించిన డీఎస్పీ.
Previous Post Next Post

نموذج الاتصال