హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షానికి బంజారాహిల్స్ లో ఓ రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ట్యాంకర్ నేలలో కూరుకుపోయింది. దీంతో ట్యాంకర్ డ్రైవర్ తో పాటు క్లీనర్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.
రహదారి కుంగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో నెలలో కూరుకుపోయిన ట్యాంకర్ ను తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడ్డ డ్రైవర్, క్లీనర్ లను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారుబంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 1లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు ఆకస్మాత్తుగా కుంగడంతో అటువైపుగా వెపుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ అందులో కూరుకుపోయింది. అదృష్టవశాత్తు వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌కు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ట్యాంకర్ ను బయటకు తీశారు జీహెచ్ఎంసీ అధికారులు. రహదారి కుంగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Tags
Hyderabad