Vikarabad: దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

 వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు

కారాబాద్ జిల్లా: చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి, బాలికపై అత్యంత క్రూరంగా అత్యాచారయత్నం చేశాడు. వరాల్లోకి వెళితే, బాధిత బాలిక తల్లిదండ్రులు చన్గోముల్ నేవీ రాడార్ స్టేషన్‌లో పని చేస్తున్నారు. అదే ప్రాంగణంలో నిందితుడు కూడా లేబర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిందితుడు బాలికను ఏకాంతంలో చూసి, ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. అతడిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలికను కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Previous Post Next Post

نموذج الاتصال