మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం కంచింపల్లి గ్రామంలో సోమవారం విద్యుదా ఘాతంతో బాలుడు మృతి చెందాడు. గ్రామంలో రఘు, చంద్రకళల కుమారుడు మనోజ్‌కుమార్(7) వారి ఇంటి పక్కనే ఉన్న ఇంటిపైకి వెళ్లి గాలిపటం ఎగురవేస్తుండగా తెగి విద్యుత్ తీగలకు వేలాడింది.
దాన్ని ఇనుపచువ్వతో తీసే ప్రయత్నం చేసి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఆ పక్కనే ఉన్న మరో బాలుడు కూడా గాయపడ్డాడు. ఇద్దరిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మనోజ్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.