మీరు ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం ముఖ్యంగా మెట్రో, అర్బన్ ఏరియాల్లో సేవింగ్స్ అకౌంట్‌లకు మినిమం బ్యాలెన్స్ రూ.10,000 నుంచి ఏకంగా రూ.50,000కి పెంచేసింది. ఈ కొత్త రూల్ ఆగస్టు 1, 2025 తర్వాత ఓపెన్ అయ్యే అన్ని కొత్త అకౌంట్‌లకు వర్తిస్తుంది. ఈ విషయం శనివారం బ్యాంక్ విడుదల చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.
ప్రాంతం | పాత మినిమం బ్యాలెన్స్ (రూ.) | కొత్త మినిమం బ్యాలెన్స్ (రూ.) |
---|---|---|
మెట్రో / అర్బన్ | 10,000 | 50,000 |
సెమీ-అర్బన్ | 5,000 | 25,000 |
గ్రామీణ ప్రాంతాలు | 2,500 | 10,000 |
గ్రామీణ ప్రాంతాల్లో కూడా
దీంతోపాటు సెమీ-అర్బన్, రూరల్ ఏరియాల్లో కూడా మినిమం బ్యాలెన్స్ పెంచారు. సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు రూ.5,000 మినిమం బ్యాలెన్స్ ఉంటే, ఇప్పుడు అది రూ.25,000కి పెరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల బ్రాంచ్‌లలో రూ.2,500 నుంచి రూ.10,000కి పెంచారు. అంటే, ఇప్పుడు ఎక్కడైనా సరే, అకౌంట్‌లో ఎక్కువ బ్యాలెన్స్
Tags
inidia