New Ration Cards: పండుగ వేళ అదిరిపోయే న్యూస్.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు..

 



సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం కోసం సర్కారు ముందడుగు వేసినట్లయింది. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు జారీ కానున్నాయి. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం కోసం సర్కారు ముందడుగు వేసినట్లయింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు.. పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కుల గణన సర్వే ఆధారంగా చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, కమిషనర్‌లకు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారు. copy and open link (https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/new-ration-cards-guidelines-2.pdf)








మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శిస్తారు.. ఈ సందర్భంగా చదివి వినిపించి చర్చించిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు ఆమోదం లభించనుంది. దీంతోపాటు.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆహార భద్రత కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులు సైతం జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి పౌరసరపరఫరాల శాఖ కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయనుందని అధికారిక ఉత్తర్వుల్లో తెలిపారు. 

 



Previous Post Next Post

نموذج الاتصال