ఆంధ్ర పాలకుల చేతిలో అణిచివేతకు గురై ప్రత్యేక తెలంగాణలో కూడా పట్టించుకునే నాధుడు లేక తాగుబోతులకు వ్యభిచారులకు అడ్డగా మారిన లెదర్ పరిశ్రమ భవనం.
కొనసాగుతున్న 20 సంవత్సరాల నిరీక్షణ..
పేదల గైరాన్ భూములు తీసుకున్నారు లెదర్ పార్కు కోసం భవనం కట్టిండ్రు చేతులు దులుపు వేసుకున్నారు.
ఎక్కడ ఏమిటి ఎందుకు ఎలా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ సిద్ధించినాక కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి అలాగే ఎమ్మెల్యేల విషయానికొస్తే 2004 వరకు ఉన్న ఎం చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ చర్లకోల లక్ష్మారెడ్డి ఒక సంవత్సర కాలం పాటు మల్లురవి తర్వాత చర్లకోలా లక్ష్మారెడ్డి.. జడ్చర్ల నియోజకవర్గం నుండి మంత్రిగా కూడా చేసిన లక్ష్మారెడ్డి హయాంలోనూ లెదర్ పార్కు సంబంధించి ఒక్క ఇటుక పెళ్ళ కూడా కదలకపోవడం శోచనీయం అలాగే ప్రస్తుత శాసనసభ్యులుగా కనిపిస్తున్న లెదర్ పార్క్ విషయం తెలుసా తెలియదా అనే విషయం సందిగ్ధంలో ఉంది ఇప్పుడైనా అధికార పార్టీలో ఉన్న పాలకవర్గం లెదర్ పార్క్ మీద దృష్టి సారించాలని పరువులు పలువురు కోరుకుంటున్నారు.
ఇవాళ డేట్ 8 11 2023 20 సంవత్సరాల క్రితం 2003లో సుమారుగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ శివారులో పోలేపల్లి గ్రామంలోని కొందరు కుటుంబాల దగ్గర నుండి ప్రభుత్వ గైరాన్ భూమిని సుమారు 25 ఎకరాలను సమీకరించి అక్కడ లెదర్ పార్కు పెట్టాలని ఉద్దేశంతోనే రైతుల నుండి భూసేకరణ చేశారు ఇంతవరకు బాగానే ఉంది.
సుమారు 200 పైగా ఔత్సాహితులకు హైదరాబాదులో రెండు నుంచి ఆరు నెలల పాటు లెదర్ పరిశ్రమలు పనిచేయుటకు శిక్షణ తరగతులు ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి ఈ 20 సంవత్సరాలలో సుమారు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఐదుసార్లు ఎంపీ ఎలక్షన్లో ఐదుసార్లు జరిగాయి కానీ ఇప్పటివరకు లెదర్ పరిశ్రమకు సంబంధించిన పనులు ఎలాంటి పురోగతి లేదు కలెక్టర్లు మారుతున్నారు ఎమ్మార్వోలు మారుతున్నారు ఎంపీడీవోలు మారుతున్నారు మంత్రులు మారుతున్నారు ముఖ్యమంత్రి మారుతున్నారు తెలంగాణ ఉద్యమం మొదలై పూర్తయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి చివరిలోకి కూడా వస్తుంది కానీ పోలేపల్లి లోని లెదర్ పరిశ్రమ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా మారింది.
పాలకులకు చిత్తశుద్ధి లేకపోతే అధికారులకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను సరైన సమయంలో అమలు చేయకపోతే చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలే.
ఆ కాలంలో 1,2 లక్షలు మూడు లక్షలు ఉన్న పొలాలు నేడు వందల కోట్లకు మారాయి కానీ పొలం తీసుకున్న ప్రభుత్వం ఇచ్చిన మాట ఆనాడే నిలబెట్టుకుని ఉంటే నేడు కొన్ని కుటుంబాలు రోడ్డున పడేవి కావు లెదర్ పరిశ్రమ కోసం భూమి ఇచ్చి సర్వం కోల్పోయిన రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా మాకు ప్రత్యామ్నాయం చూపిస్తారా లేదంటే మా పొలం మేము దున్నుకోవాలా అంటున్నారు ఇంత లెదర్ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎవరు? వారి వివరాలు వాళ్ల సాధక బాధకాలు వారి మాటల్లోని విందాం.