Jclnews update :-అంగరంగ వైభవంగా రంగనాయక స్వామి శ్రావణమాస ఉత్సవాలు.

 పాలమూరు జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో బాదేపల్లి పాత బజార్ శ్రీ రంగనాయకుల పెద్దగుట్ట ఉంది కదుల్లా ఈ గుట్టపై శ్రావణమాసంలో పెద్ద జాతర అయితది. 




ఈ జాతరకు జడ్చర్ల నియోజకవర్గ నుండే కాకుండా పాలమూరు, హైదరాబాద్ నుండి నుండి కూడా జనాలు శానా మంది వస్తరు. అయితే పోయిన నెల కింద గుటమీన జరిగిన విధ్వంసంలో ధ్వంసమైన కోనేరును మళ్లీ తీర్చిదిద్దిండ్రు శ్రీ రంగనాయక స్వామి దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు. ఈయాల శ్రావణమాసం తొలి శనివారం కదా అందుకు ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు పిల్లలు అందరు వచ్చి రంగనాయక స్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నరు. అయితే ఎనుకటికి గుట్టమీదికి రోడ్డు లేకుంటే మెట్ల మీదనుండి అందరూ గంటలు గంటలు కష్టపడి నడుచుకుంటూ వచ్చేటోళ్లు అయితే పోయిన సంవత్సరం అటు పోయిన సంవత్సరం అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గుట్టమీదికి సిమెంటు రోడ్డు ఏ పిచ్చిండు. అప్పటి నుంచి గుటమీదికి ఆటోలు, కార్లు, మోటార్ సైకిళ్ళు ఏసుకొని మస్తు మంది వస్తుండ్రు. శ్రావణమాసం సందర్భంగా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రాంరెడ్డి, సభ్యులు గుట్ట మీద 15, 20 రోజుల నుంచి అంతా శుభ్రంగా సాఫ్ చేపిచ్చిండ్రు. పోయిన నెల కింద గుట్టమీద విధ్వంసం జరిగిందని పోయిన శుక్రవారం పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రాంరెడ్డి శ్రావణమాసం వస్తుందని శాంతి పూజలు, సంప్రోక్షణ పూజలు చేపిచ్చిండ్రు. ఇంగా ఈయాల శనివారం అని మస్తు మంది వచ్చిండ్రు అయితే గుడి కమిటీ సభ్యులు అందరికీ పూజలు చేపిచ్చి వచ్చి నోళ్లకు అన్నదానం కూడా చేసిండ్రు. అయితే గుట్టమీదకి వచ్చినోళ్ళు కూడా సరదాగా ఆడుతూ పాడుతూ బతుకమ్మలు వేస్తూ హుషారుగా ఉన్నరు. ఈ మధ్యనే ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రాంరెడ్డి లక్ష్యం నెరవేరాలంటే లక్ష అడుగులు పడాలని జడ్చర్లలో మస్తు ప్రచారం చేస్తూ అందర్నీ గుట్ట మీదికి రావాలని పత్రికలిచ్చి చెప్తుండు. అందుకు జడ్చర్ల పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా ఆల్ల సుట్టాలు ఈల్ల సుట్టాలు అందరూ వచ్చి గుట్టమీద సామిని మొక్కిపోతుండ్రు. అట్లాగే మన్యంకొండ గుట్టమీద ఉన్నట్టు బాదేపల్లి గుట్ట మీద కూడా తీగల వంతెన ఉంటే ఇంకా గుట్ట మీద చానా అభివృద్ధి అయితదని అంటుండ్రు. ఇక్కడున్న అధికారులు మీరు జరా కనికరించి గుట్టమీద భక్తులకు వసతులు కల్పించి, తీగల వంతెన ఏర్పాటు చేసి, మంచి మంచి పూల చెట్లు పెట్టి వనాలు చేస్తే ఇంకా గుట్టమీద చానా అభివృద్ధి అయితది సార్లు. సరే మీరు కూడా పోనోళ్లు ఉంటే పోయి రండి, పోయి సామిని దర్శనం చేసుకుని గుట్టమీద ఎంజాయ్ చేసి రండి ఇంకెందుకు ఆలస్యం...

Previous Post Next Post

نموذج الاتصال