వాగులపై వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు కోసం మంత్రి వినతి పత్రం ఇచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే

కాలు జారితే.ఖతం అనే వార్త నిన్న యూట్యూబ్లో వచ్చిన తర్వాత 

జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రి తో మాట్లాడి నిధులు కేటాయించాలని కోరినట్లు మీడియాకు ఒక ప్రకటనలో వెల్లడించారు. 



జడ్చర్లలో వంతెనల నిర్మాణానికి రూ.44.10 కోట్లు

• తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటుకానున్న కొత్త వంతెనలు

• జడ్చర్ల మండలం నల్లకుంట తాండా, లింగంధన, భైరంపల్లి, తుపడగడ్డ తాండా,

- బాలానగర్ మండలం సూరారం, బోడ జానం పేట్,

- రాజాపూర్ మండలం కుచ్చర్కల్

- మిడ్జిల్ మండలం వేములపల్లి ప్రాంతాల్లో నిర్మాణం కానున్న కొత్త బ్రిడ్జిలు

• నియోజకవర్గంలో తీరనున్న ప్రజల వర్షాకాల కష్టాలు

• గత ఏడాదిలోనే ప్రతిపాదించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

• 2024 జూన్ లో మొదలైన నిధుల మంజూరు ప్రక్రియ

• నల్లకుంట తాండా ప్రజల కష్టాల పై స్పందించి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే

• సానుకూలంగా స్పందించి అధికారులకు తక్షణ ఆదేశాలను జారీ చేసిన సీతక్క

• ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడి.

జడ్చర్ల, జూలై 24: జడ్చర్ల నియోజకవర్గంలో తొమ్మిది ప్రాంతాల్లో వంతెనలు కట్టడానికి గత ఏడాదిలో తాను చేసిన ప్రతిపాదనల కోసం అవసరమైన రూ.44.10 కోట్ల ను వెంటనే మంజూరు చేసి, వంతెనల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కోరామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీతక్క వంతెనల నిర్మాణాలకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారని వెల్లడించారు.



అనిరుధ్ రెడ్డి గురువారం మంత్రి సీతక్కను కలిసి గతంలో తాను ప్రతిపాదించిన వంతెన నిర్మాణాలకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరామని మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది జూన్ నెలలో తాను జడ్చర్ల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో వంతెనలు నిర్మించాల్సిన అవసరమున్న ప్రాంతాలను గుర్తించి వీటి నిర్మాణానికి నిధులను కేటాయించాల్సిందిగా కోరామని గుర్తు చేసారు. ఈ విషయంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సీతక్క పంచాయితీరాజ్ ఈఎన్సీకి ఆదేశించడంతో దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ మొదలైయిందని అనిరుధ్ రెడ్డి చెప్పారు. తాను నియోజకవర్గంలో ప్రతిపాదించిన తొమ్మిది వంతెనల వివరాలను ఆయన వివరించారు. జడ్చర్ల మండలం లింగంపేట నుంచి నల్లకుంట తాండాకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు, ఎక్వాయిపల్లి నుంచి లింగంధన వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు, నెక్కొండ నుంచి బైరంపల్లి వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు, కొండేడు నుంచి తుపడగడ్డ తాండా మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే బాలానగర్ మండలంలో జాతీయ రహదారి నుంచి ఉడిత్యాల, మోతీఘనపూర్, సూరారం మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు, శేరిగూడ నుంచి బోడజానంపేట్ కు వెళ్లే రోడ్డులో వంతెన నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదించామని చెప్పారు. నవాబుపేట మండలంలో వీరశెట్పల్లి నుంచి దయాపంతులపల్లి మీదుగా హాజీపూర్ వెల్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.2.40 కోట్లు ప్రతిపాదించామన్నారు. రాజాపూర్ మండలంలో రాయపల్లి నుంచి కుచ్చర్కల్ వెళ్లే రోడ్డులో బ్రిడ్జి నిర్మాణానికి రూ.6 కోట్లు, మిడ్జిల్ మండలంలో వల్లభరావుపల్లి నుంచి చౌటకుంటతాండా మీదుగా వేముల వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.10.20 కోట్ల చొప్పున మొత్తం తొమ్మిది వంతెనల కోసం రూ.44.10 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదించామని అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ గత ఏడాదిలోనే మొదలైయిందన్నారు. అయితే ఈ ప్రాంతాల్లో వంతెనలు లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండటం, ముఖ్యంగా వర్షా కాలంలో ప్రమాదాలు కూడా సంభవిస్తుడటంతో ఈ వంతెనలకు నిధుల మంజూరు ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, వాటి నిర్మాణాను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా తాను మంత్రి సీతక్కను కలిసి కోరామని వివరించారు. ఈ విషయంగా సానుకూలంగా స్పందించిన సీతక్క దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేసారని వెల్లడించారు. వంతెనల నిర్మాణాలను వెంటనే నిధులు మంజూరై, వాటికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభమౌతాయని అనిరుధ్ రెడ్డి తెలిపారు. 

• 

Previous Post Next Post

نموذج الاتصال