Telangana: తెలంగాణలో రేషన్ కార్డుల కొత్త నిబంధనలు ఏంటంటే..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై తాజాగా స్పష్టతం వచ్చింది.
కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవకాశం కోల్పోకోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుండి కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు ఉపసంఘము చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తక్షణమే రాజ్యసభ, లోకసభ,శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధి విధినాలలో వారి నుండి సూచనలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి డి.యస్ చౌహన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. అంతే గాకుండా డాక్టర్ ఎన్.సి.సక్షేనా కమిషనర్ గా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో పరిగణనలోకి తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కమిటీలో సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండర్ సభ్యుడిగా ఉన్నారు.అంతే గాకుండా రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు దిగువ పేద మధ్యతరగతి ప్రజలకు మంజూరు చేసునున్న తెల్ల రేషన్ కార్డుల మంజూరీ విషయంలో అధికారుల బృందం ఇప్పటికే దేశంలోని మిగితా రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో అవలంబిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే అదే సమయంలో అంతర్ రాష్ట్రాల నుండి తెలంగాణకు వలస వచ్చిన వారికి అక్కడ ఇక్కడ రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్లు తేలిందని అటువంటి వారికి అక్కడో… ఇక్కడో అన్న అప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉప సంఘము చర్చించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవుగా కొత్త తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో పది లక్షల దరఖాస్తులు వచ్చాయా న్నారు.