ఎర్ర సత్యం అన్న.. రావా ఒకసారి కదలి రావా మళ్లీ రావా..ఎర్ర సత్యం ఇది పేరు కాదు ఒక బ్రాండ్..
ఇంటిపేరు మరాఠా.
మా నాన్న పెట్టిన పేరు సత్యనారాయణ..
జనాలు పిలిచే పేరు సత్యమన్న..
అందరూ ప్రేమగా చెప్పుకునేది ఎర్ర సత్యం అన్న..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర నాయకుల పెత్తనం కొనసాగుతున్న కాలంలో కరువు జిల్లా పాలమూరు పేరు చెప్పితే వనికేలా చేసిన ఏకైక వీరుడు ఎర్ర సత్యం అన్న అలియాస్ మరాఠ. సత్యనారాయణ
ఇంటింటా ఈ వట్టదింతా ఈ అన్నట్లుగా..
ఎర్ర సత్యం అన్న ధన్వాడ మండలం నుండి హైదరాబాద్ కేంద్రంగా టిడిపికి లో ఎమ్మెల్యేగా ఎదిగాడు...
ఏ కన్ను కుట్టిందో ఏ కడుపు మండిందో ఏ కుళ్ళు కుతంత్రం నడిచిందో బడుగు బలహీన వర్గాల వీరుడు నేలకొరిగాడు..
అన్న వస్తున్నాడు అంటే అన్నం తినేది వదిలేసి ఆలి పిల్లలను వదిలేసి అన్న అడుగులో అడగాలి నడిచిన వాళ్ళు వేళల్లో ఉన్నారు..
అన్న నువ్వు చనిపోయి 28 ఏళ్లు గడుస్తా ఉన్న ఇప్పటికీ నీ యాదిలో మేమున్నాం. నువ్వు వస్తావని నీకై ఎదురు చూస్తున్నాం అన్న.
నీ పేరు చెప్పుకొని నువ్ ఇచ్చిన కాగితం మీద ఎదిగినోళ్లు ఇప్పుడు నీ కులాన్ని నీ బడుగు బలహీన వర్గాలని తొక్కుతున్నారన్న రావా ఒకసారి కదలి రావా మళ్లీ రావా..
కొందరి చేతుల్లో బందీలై అన్నగారి పోతున్న వాళ్ళ ఆశలకు ఊపిరి పోసి ఊపిరి పోసిన ప్రాణాలను పెంచి పెద్దగా చేసిన నువ్వు మా అందరి మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం..
నువ్వు ఉన్నంటే మా బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఇంకోలా ఉండేది.
మరాఠ. సత్యనారాయణ తెలంగాణ pranthaniki చెందిన రాజకీయ నాయకులు ఆయన 1994లో జడ్చర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు
ఎర్ర సత్యం తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చి పార్టీలో వివిధ హోదాలో పనిచేసి తొలిసారి టిడిపి పార్టీ తరఫున 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుండి టిడిపి తరఫున పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నర్సప్పపై 53,779 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు..
ఎర్ర సత్యం అన్న 1996 ఆగస్టు 12 జడ్చర్ల నియోజకవర్గం లోని పాత బజార్లో గల పాఠశాల దగ్గర జి మాధవరెడ్డి అనే మాజీ పోలీస్ కానిస్టేబుల్ కలిసి చంపాడు దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.