హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు మరియు రూ.2000/- నగదు జరిమానా*

 


*


ఈరోజు అనగా 25.07.2025న మహబూబ్‌నగర్ జిల్లాలోని అత్యంత కీలకమైన హత్య కేసులో న్యాయస్థానం తీర్పు వెలువడింది. Cr.No.250/2023 U/s 302 IPC, II-Town పోలీస్ స్టేషన్, మహబూబ్‌నగర్ నందు నమోదైన కేసులో , నిందితుడు మొహమ్మద్ సిద్దిఖుల్లా ఖాన్ అలియాస్ అలి ఖాన్ (పుట్టిన పేరు: మొ. హమీదుల్లా ఖాన్, వయసు: 47 సంవత్సరాలు, వృత్తి: టీ మాస్టర్, నివాసం: ఎస్.ఎస్.గుట్ట, మహబూబ్‌నగర్) పై జీవిత ఖైదు మరియు రూ.2000/- జరిమానా విధిస్తూ, గౌరవనీయ III అదనపు జిల్లా న్యాయమూర్తి ఫ్యామిలీ కోర్టు జడ్జి శ్రీమతి రాచపూడి శ్రీదేవి గారు తీర్పు వెలువరించారు.


ఈ కేసు మొదట 174 Cr.P.C. (సస్పిషస్ డెత్) క్రింద నమోదైంది. అనంతరం జరిగిన సమగ్ర దర్యాప్తులో, బాధితుడు షహేరియార్ అహ్మద్ అనే 16 ఏళ్ల యువకుడిని, రూ.500/- రుణం తిరిగి అడిగినందుకు తీవ్ర కోపానికి లోనైన నిందితుడు తన అద్దె ఇంట్లో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. నిందితుడిని 02.09.2023 న అరెస్టు చేసి, 29.09.2023 న కోర్టుకు చార్జిషీట్ సమర్పించబడింది.


*ఈ కేసు విజయం సాధించడంలో క్రింది అధికారుల పాత్ర ప్రశంసనీయం:*


ప్రాసిక్యూషన్ అధికారులు: కె. నరేష్ కుమార్, PP.

కేసు దర్యాప్తు అధికారి: ఎ. ప్రవీణ్ కుమార్, SHO (పూర్వ) II-Town PS

ప్రస్తుత SHO: అజాజుద్దిన్, II-Town PS

CDO: బి. వెంకటయ్య, హెడ్ కానిస్టేబుల్ 1751, ఫ్యామిలీ కోర్ట్ లాయిసన్.


ఈ కేసులో న్యాయ పరంగా నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన న్యాయ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులను జిల్లా పోలీస్ అధికారి డి. జానకి, ఐపీఎస్ హృదయపూర్వకంగా అభినందించారు. న్యాయపాలనలో ప్రజలకు నమ్మకాన్ని కలిగించే ఈ తీర్పు, జిల్లా పోలీస్ శాఖ విధేయతకు నిదర్శనంగా

 నిలిచింది.


Previous Post Next Post

نموذج الاتصال