విద్యార్థులకు భగవద్గీత కాలేజీ బ్యాగుల బహుకరణ

 



ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు గోనయో ఫౌండేషన్ బహుమతి అందజేత.


 జడ్చర్ల టౌన్: జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని, విద్యార్థులకు ఎవరైతే పదవ తరగతి ఫలితాలలో మొదటి ర్యాంకు సాధించారో వాళ్లకు గోనయో ఫౌండేషన్ తరపున బహుమతి( కాలేజ్ బ్యాగు, భగవద్గీత) అందజేశారు.

 ఈ కార్యక్రమానికి జడ్చర్ల మండల విద్యాశాఖ అధికారిని మంజుల దేవి గార, రాజపూర్ మండల విద్యాశాఖ అధికారి సుధాకర్  ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. 

 గోనయో ఫౌండర్ ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరంలో అడుగు పెడతారు కాబట్టి ఒక *బ్యాగు* అలాగే విద్యార్థులకు జ్ఞానంతో పాటు నైతిక విలువలు కూడా అలవాటు కావాలని చిన్న ఆలోచనతో *భగవద్గీత* ఇవ్వడం పంపిణీ చేస్తున్నాము అన్నారు. అలాగే ముందు ముందు కూడా ఇలాంటి ఎన్నో సాంఘిక, సంక్షేమ కార్యక్రమాలకు గోనయో ఫౌండేషన్ శ్రీకారం చేస్తుందని అని ఆయన తెలిపారు.

 ఈ కార్యక్రమంలో కోడుగల్, గంగాపురం, జడ్చర్ల ఉపాధ్యాయులు మరియు గోనయో సభ్యులు పాలెం సూరిబాబు గౌడు, ఏబీవీపీ నాయకులు హన్మగాళ్ల బాల్ రాజ్, సాంబశివరావు, హరీష్ గౌడు, మణికంఠ, నర్సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال