జడ్చర్లలో బిజీబిజీగా గడిపిన జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి నేడు ప్రాంతీయ వైద్యశాలను సందర్శించారు.
అవినీతి అధికారులను ప్రశ్నించడం తప్ప...
అలాంటి అధికారులని తప్పు అని చెప్పిన వాళ్ళ తప్పులు సరిదిద్దుకునే దాకా ప్రశ్నిస్తూనే ఉంటా.
భూదాన్ భూముల విషయంలో ఎట్టి పరిస్థితులు ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు.
30 జూన్ నాడు సాయంకాలం అంధకారంలో హాస్పిటల్ అన్న వార్తకు స్పందించి స్థానిక శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి 100 పడకల ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై సూపెర్డెంట్ సోమశేఖర్ తో పాటు అందరి డాక్టర్ల సముదాయంలో సమీక్ష సమావేశం నిర్వహించి, వంద పడకల ఆసుపత్రిలో ఉన్న సమస్యలుగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఏ ఈ కు ఫోన్ చేసి 100పడకల ఆసుపత్రికి సంబంధించిన లైన్ ను పోల్లపల్లి సేజ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఫీడర్ కు మార్చాలి అని తెలిపారు, దానికి సంబంధించిన పనులు చూడాలి అని తెలిపారు.
100పడకల ఆసుపత్రి పేరుకే 30 పడకల ఆసుపత్రిలో ఉన్న వసతులు మాత్రమే ఉన్నాయి. సరియైన డాక్టర్లు లేరు అని మీడియా వేసిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ త్వరలోనే ఉన్నత అధికారులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి అందరూ డాక్టర్లను ఏర్పాటు చేయిస్తానని ఈ సమస్యలన్నిటిని అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తానని అనిరుద్ రెడ్డి అన్నారు.
వంద పడకల ఆసుపత్రికి సంబంధించిన దానికి సరియైన రోడ్డు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన స్థలం వివరాలు ఇవ్వాలని స్థానిక ఎమ్మార్వోను గత కొద్ది కాలంగా అడుగుతున్నాను అతను నాకు ఫైల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు , త్వరలోనే100పడకల ఆసుపత్రిని జాతీయ రహదారి 167 నుండి నేరుగా లోపలికి వచ్చే విధంగా చేసే బాధ్యత నాది అని అలాగే 100 పడకల ఆసుపత్రిలో ఎలాంటి ఆసావుకార్యాలు ఉన్న వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని కొద్దిగా సమయం ఇవ్వాలని కోరారు.