*ఏం సాధించావురా ఓ మనిషి*?
------------------------------------
నేను అనే గర్వంతో విర్రవీగుతూ ఎవరిని లెక్క చేయకుండా ఏమి
సాధించావు రా ఓ మనిషి?
స్వార్థపు ఆలోచనతో సంపాదనకై ఆరాటపడుతూ ఆస్తులు,అంతస్తులు పెంచుకుంటూ ఎగిసిపడుతున్నావు?
ఉన్న భూమిని గజం లెక్కన అమ్మి సొమ్ము చేసుకుంటూ ఎంతెత్తు ఎదిగావురా ఓ మనిషి ?
వెనుతిరిగి చూస్తే ఎందరో కష్టాలకు,కన్నీళ్లకు
కారకుడవు అయ్యావురా
ఓ మనిషి?
జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు మోసాలేనా?
అబద్ధపు అరుపులతో మేక వన్నె పులిలా మారి మనుషులను మోసం చేశావురా ఓ మనిషి?
అవసరానికి అంతా నువ్వే అంటూ ఆరాటపడుతావు అవసరం తీరితే నువ్వెంత నీ బతుకెంత అంటావు?
మంచితనాన్ని మరిచి నీ గమ్యం ఏమిటో మరిచిపోయావు?
మోసంతో మనుషులను మాయ చేస్తూ
మానవత్వాన్ని మంటగలిపి మనిషిగా నీవెప్పుడు గెలిచావురా?
మనస్సు నిండా ప్రేమతో
మనసారా నవ్వుకుని,
ఆనందంతో,ఆత్మీయంగా
కుటుంబ సభ్యులతో సుఖంగా బతికి ఎన్నాళ్లయిందో మర్చిపోయావా ఓ మనిషి?
ఇంకా ఎన్నాళ్ళు,ఎన్నేళ్లు నటిస్తావు ఒక నటుడిగా ఇక చాలించు నీ అవినీతికి అంతం పలుకు బ్రతికున్నన్ని రోజులు హాయిగా, ఆనందంగా జీవించు
ఓ మనిషి,,,
✍🏻 *వి.జానకి రాములు గౌడ్*