జడ్చర్ల రంగనాయక స్వామి చరిత్ర

జడ్చర్ల

 చుట్టుపక్కల గ్రామాల వాళ్లు వ్యవసాయదారులు తమ పంటలకు పట్టిన చీడపురుగుల నివారణ కొరకు ఈ గుండంలోని నీళ్లను తీసుకొని పోయి చీడ పట్టిన పంట పొలాలలో ఆ  నీటిని చల్లేవారు ఫలితంగా వంటకు పట్టిన చీడపోయి పొలాలన్నీ సస్యశ్యామలమయ్యేవని స్థానిక వ్యవసాయదారులు తమ అనుభవాలను పంచుకున్నారు. 

విపరీతమైన కడుపునొప్పి తో బాధపడేవారు అదేవిధంగా స్త్రీలకు సహజసిద్ధంగా రుతుక్రమంలో వచ్చే కడుపునొప్పి నివారణకు ఈ గుణం లోని నీళ్లు కడుపునొప్పిని నివారించేవని స్థానికులు పూర్తి అనుభవంతో తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

అంతేకాకుండా అన్ని కాలాల్లో ఇంత ఎత్తు పై నీళ్లు ఉండడం అనేది భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. 

ఇక్కడ ఈ గుండంలో నిరంతరం ఎడతెగని నీటి జాలు (ఊట) ఉందని పెద్దలంటారు. 

నీటికి ఆధారమైన ఊరు కాబట్టే జలచర్ల అనే పేరు ఏర్పడిందని చారిత్రకుల అభిప్రాయం. 

ఈ గుండంలో ఒక పెద్ద సొరంగ మార్గంలో నీటిజాలు ఉందని స్థానికులు అభిప్రాయం. 

ఒక పెద్ద చేదురు బావి కూడా ఈ గుండం అట్ట డుగులో ఉందని పెద్దలంటారు. 

పురాతన దేవాలయాలు మన సంస్కృతికి నిలయాలు. మన ఇతిహాసానికి ఆనవాళ్లు.

ఆ ఆనవాళ్లను చెరిపి వేసుకోవడం అనేది మన సంస్కృతిని మనమే కాలరాసుకోవడం అవుతుంది.

జడ్చర్ల వాసులకు కొంగుబంగారమై అలరారుతున్న శ్రీ రంగనాయకుని వైభవాన్ని దూరం చేసుకుంటే జడ్చర్ల పట్టణం శోభ దూరమైనట్లే అని భావించాలి. 

ఇది జడ్చర్ల వాసులు చుట్టుపక్కల గ్రామాల వారు ఏమాత్రం హర్షించరు. అంతేగాక అరిష్ట దాయకం.

గోన గన్నారెడ్డికి ఇద్దరు సోదరులు; గోన కాచారెడ్డి, గోన విఠలనాథ, సోదరి కుప్పాంబిక ఉన్నారు. వీరు కవులు. గోన కాచా రెడ్డి, విఠలనాథ రచనలలో రంగనాథ రామాయణములో ఉత్తరకాండ విభాగాన్ని పూర్తి చేసిన రచనలు ఉన్నాయి. రంగనాథ సంస్కరణ తెలుగు సాహిత్య చరిత్రలో గోన గన్నారెడ్డి రచించిన మొదటి, అగ్రశ్రేణి రామాయణం. అతని సోదరి, కుప్పాంబిక బుద్ధపురం శాసనాల ప్రకారం మొదటి తెలుగు కవయిత్రిగా ప్రసిద్ధి చెందినదని తెలుస్తుంది. కుప్పాంబిక మాల్యాల గుండదండాదీశుని వివాహం చేసుకుంది. అతడిని దండ సేనాని అని కూడా అంటారు.

మహబూబ్ నగర్ సమీపంలోని దక్షిణ తెలంగాణలో ఉన్న ఖిల్లా ఘన్ పూర్ అనే పట్టణానికి గణపురం అని గన్నారెడ్డి, కాకతీయ రాజు గణపతి దేవుడు పేరు పెట్టారు. కాకతీయ పాలనలో తన బావ దండ సేనాని సహాయంతో పలు సరస్సులను నిర్మించాడు. గోన గన్నారెడ్డి ప్రతాపరుద్ర రాజు పాలనలో కీలక పాత్ర పోషించారు. వర్ధమానపురానికి చెందిన గోన గన్నారెడ్డి రాయచూర్‌ను జయించి కోటను నిర్మించాడు.

కాకతీయ రాజవంశం (995-1323) కాలంలో, గోన బుద్దారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆధునిక ఘన్ పూర్ లోని వర్ధమానపురం (ప్రస్తుతం నంది వడ్డేమాన్ గా పిలువబడుతుంది), ఖిల్లా ఘన్ పూర్ (కోట ఘన్ పూర్) నుండి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రాజ్యాన్ని పాలించారు.[

గోన గన్నారెడ్డికి ఇద్దరు సోదరులు; గోన కాచారెడ్డి, గోన విఠలనాథ, సోదరి కుప్పాంబిక ఉన్నారు. వీరు కవులు. గోన కాచా రెడ్డి, విఠలనాథ రచనలలో రంగనాథ రామాయణములో ఉత్తరకాండ విభాగాన్ని పూర్తి చేసిన రచనలు ఉన్నాయి. రంగనాథ సంస్కరణ తెలుగు సాహిత్య చరిత్రలో గోన గన్నారెడ్డి రచించిన మొదటి, అగ్రశ్రేణి రామాయణం. అతని సోదరి, కుప్పాంబిక బుద్ధపురం శాసనాల ప్రకారం మొదటి తెలుగు కవయిత్రిగా ప్రసిద్ధి చెందినదని తెలుస్తుంది. కుప్పాంబిక మాల్యాల గుండదండాదీశుని వివాహం చేసుకుంది. అతడిని దండ సేనాని అని కూడా అంటారు.

Previous Post Next Post

نموذج الاتصال