
జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు ఆర్మీ జవానులు. కుల్గామ్ జిల్లా ప్రిసల్ చిన్నగామ్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో సైనికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు టెర్రరిస్టులు చనిపోయారన్నారు ఆర్మీ అధికారులు.
ఇంకా ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని ప్రకటించారు. ఇక కుల్గాం జిల్లాలోనే మరో ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారన్నారు.
from V6 Velugu https://ift.tt/SOYcRBs
via IFTTT
Tags
News