Ex సర్పంచుల సంఘం పెండింగ్ బిల్లుల కొరకు రాష్ట్ర సచివాలయం ముందు ఆగస్టు 2న నిరసన దీక్ష

 


*సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులకొరకు - రాష్ట్ర సచివాలయం ముందు ఆగస్టు 2న నిరసన దీక్ష*  


*◆ సర్పంచుల సంఘం రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్*


తెలంగాణ గ్రామ పంచాయతీలలో పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయమై తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఎన్ని వినతులు చేసినా ప్రభుత్వం నుండి చలనం లేదని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2019 - 2024 కాలవ్యవధిలో సర్పంచులుగా కొనసాగి రాష్ట్రవ్యాప్తంగా సొంత గ్రామ పంచాయతీ పరిదులలో అప్పటి ప్రభుత్వ సూచనలు మరియు ఆదేశాల మేరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గ్రామపంచాయతీలలో వీధిలైట్ల నిర్వహణ, అంతర్గత మురుగు కాలువల ఏర్పాటు, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వైకుంఠధామం, మనఊరు - మనబడి, పల్లెప్రగతి, మిషన్ భగీరథ లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో చేపట్టి తెలంగాణ గ్రామ పంచాయతీలను దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దడంలో మా వంతు కృషి చేయడం జరిగిందని అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పును ప్రవేశపెట్టి ప్రజలతో, గ్రామపంచాయతీ సిబ్బందితో మమేకమై గ్రామాలను ఆరోగ్యవంతమైన గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దడం జరిగిందని ప్రణీల్ చందర్ తెలియజేసారు. అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం నుంచి సరైన సమయంలో నిధులు అందకపోయినా సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే క్రమంలో సొంత డబ్బులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఈ క్రమంలో ప్రభుత్వం నుండి మేము అధికారంలో ఉన్నప్పుడు గాని, మా పాలకమండలి గడువు ముగిసి ఆరు నెలలు కావోస్తున్నాగాని ఇప్పటికీ మా యొక్క పెండింగ్ బిల్లులు అందక 12,769 గ్రామపంచాయతీ సర్పంచుల యొక్క బాధలు వెలకట్టలేనివని అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అందక సిబ్బంది పడుతున్న బాధలు మరియు గ్రామాలలో అస్తవ్యస్తమౌతున్న పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థను చూసి మా మనసులు చలించిపోతున్నాయని తెలిపారు.గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు చేసి ఖర్చుపెట్టిన సర్పంచులు బిల్లులు అందక ఆత్మహత్యలు చేసుకున్నారని ఇట్టి విషయమై అధికారులకు,ప్రభుత్వానికి,గవర్నర్ గారికి విన్నవించినా ఫలితం శూన్యంగా ఉందని తెలిపారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామపంచాయతీలను అభివృద్ధి పరచడంలో భాగస్వామ్యులమైన మా సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు చెల్లింపులో జాప్యం వహిస్తున్న ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా *ఆగస్టు 2 వ తేదీన ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు గాంధేయ మార్గంలో నిరసన కార్యక్రమం* ఏర్పాటు చేయనైనది.కావున సర్పంచు సోదర,సోదరీమణులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్ పిలుపునిచ్చారు.





Previous Post Next Post

نموذج الاتصال