హైదరాబాద్: నగరంలోని బండ్లగూడలో (Bandlaguda) భారీగా స్టెరాయిడ్స్ (Steroids) ఇంజక్షన్లను (injections) డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు (Drug Control Bureau officials) పట్టుకున్నారు. దేహదారుఢ్యం కోసం జిమ్ (Gym) నిర్వాహకులు స్టెరాయిడ్స్ ఇంజక్షన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు జిమ్‌లకు స్టెరాయిడ్స్ ఇంజక్షన్స్ అమ్ముతున్న సయ్యద్ ఫహద్ అనే వ్యక్తిని డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. పెద్ద మొత్తంలో స్టెరాయిడ్స్ వైయల్స్‌ను స్వాధీన పరుచుకున్నారు. యువకులు కండలు పెంచేందుకు జిమ్‌లు స్టెరాయిడ్స్ ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నాయి. సిక్స్ ప్యాక్ కావాలంటే స్టెరాయిడ్స్ ఇంజక్షన్ తీసుకోవాలని జిమ్ నిర్వాహకులు చెబుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Tags
News@jcl